నన్ను కప్పుకోవాలనే చూస్తుంటుంది.
ఈ చీకటెపుడూ

వొక నిషిద్ధ ముఖచిత్రాన్ని పట్టుకు
చీకటి పడగల్తో
నానీడై తిరుగుతుంటుంది.

అనాది నేలమాళిగలోంచి
విస్తరిస్తున్న
వొక వెలుగు ను
విషాద నవ్వుల మీద పగతో
తలుపులు మూయడం కొత్త కాదు

వసంతాన్ని
ఒంటి రంగుపుల్ముకున్న
చెమటచుక్కను నేను
ఈ కాలాన్ని
క్వారంటైన్లో ఉంచు చూద్ధాం?!

ఈ చీకటి ముఖమ్మీదైనా సరే
జలజలా పారడమే తెల్సు!

Leave a Reply