భారత విప్లవోద్యమంపై ప్ర‌భుత్వ దాడికి వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌జాస్వామిక వాదులు స్పందించారు. విప్ల‌వ ప్ర‌జా పోరాటాల‌ను నిర్మూలించ‌డానికి ఇటీవలే భార‌త పాల‌కులు ప్రారంభించిన నూతన ప్రహార్‌-3ని నిరసిస్తూ “ఇంటర్నేషనల్‌ కమిటీ టు సపోర్ట్‌ పీపుల్స్‌ వార్‌ ఇన్‌ ఇండియా” (ఐసీఎస్‌పీడబ్య్యూఐ-భారత ప్రజాయుద్ధానికి మద్దతుగా అంతర్జాతీయ కమిటీ) పిలుపు మేర‌కు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనేక దేశాలలో చాలా క్రియాశీలంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇట‌లీ నుండి టునీషియా వరకు, ఈక్వడార్‌ నుండి కెనడా వరకు, అమెరికా నుండి జర్మనీ వరకు, బ్రెజిల్‌ నుండి డెన్మార్క్‌ వరకు, కొలంబియా నుండి నార్వే వరకు, స్పెయిన్‌ నుండి స్విట్టర్‌లాండ్‌ వరకు, ఐర్లాండ్‌ నుండి మెక్సికో వరకు, ఫిలిప్పీన్స్‌ నుండి అఫ్లానిస్తాన్‌ వరకు, టర్కీ నుండి ఫ్రాన్స్‌, ఆస్ట్రియా వరకు మన దేశ ప్ర‌జ‌ల పోరాటాల‌కు సమర్థనగా నిలిచాయి.ఈ సందర్భంగా ఐరోపా దేశాల విప్ల‌వ ప్ర‌జాస్వామిక శక్తులు తమ భాషలలో ప్రచార సామగ్రిని ప్రచురించాయి. భారత ప్ర‌జ‌ల‌కు తాము అండగా నిలుస్తున్నామని అనేక దేశాలు ప్రకటించాయి. వివిధ దేశాలలో అమలైన అక్షన్‌ డే వివరాలను డిసెంబర్‌ 15వ తేదీన ఐసీఎస్‌పీడబ్యుఐ అందించింది. ఇటీవ‌లే ఆ నివేదిక ఇంగ్లీషులో విస్తృతంగా అంత‌ర్జాల మాధ్య‌మాల్లో ప్ర‌చారం అయింది. దానిని పాఠకుల కోసం సంక్షిప్తంగా అందిస్తున్నాం.

  • వసంతమేఘం టీం

ఐసీఎస్‌పీడబ్యుఐ 2021 డిసెంబర్‌ 15వ తేదీన ఇచ్చిన రిపోర్ట్‌:

నూతన హంతక అపరేషన్‌ ‘ప్రహార్‌ ౩కు వ్యతిరేకంగా భారత విప్ల‌వోద్య‌మానికి మద్దతుగా విశ్వ వ్యాపితంగా నిర్వహించిన ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఆక్షన్ విజయవంతం అయింది.

గెలీసియా, ఇటలీలలోని ఐసీఎస్‌పీడబ్యుఐ కమిటీలు ఉమ్మడిగా విడుదల చేసిన ఆక్షన్ డే అపీల్‌ను స్వాగతించిన అనేక దేశాలలోని విప్లవసంస్థలు ఎక్కడికక్కడే వివిధ రూపాలలో సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాయి. ప్రపంచవ్యాపితంగా కొన్ని చోట్ల నవంబర్‌ 24వ తేదీ తరువాత కూడా భారత ప్రజాయుద్ద సంఘీభావ కార్యక్రమాలు నడిచాయి.

ప్రపంచ కార్మికవర్గానికి, పీడిత ప్రజలకూ అశారేఖగా ఉన్న భారత విప్ల‌వోద్య‌మం ఒంటరిది కాదని ఈ సంఘీభావం తెలియ‌జేసింది. ‘గ్రీన్‌హంట్’ ను ఓడించినట్టుగానే ఈ ‘ప్రహార్‌ 3’ ని కూడా భార‌త ప్ర‌జ‌లు ఓడించ‌గ‌ల‌రు.

అంతర్జాతీయతా సంఘీభావం భార‌త ప్ర‌జ‌ల‌కు అద్భుతంగా అందింది.

ఫాసిస్టు మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‘ప్రహార్‌ ౩” దాడిని భారతదేశంలో, అంతర్జాతీయంగానూ బలంగా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకిస్తారు కూడా. నిజానికి ఇది, నవంబర్ 24 డే ఆఫ్‌ అక్షన్‌ తరువాత అంతర్జాతీయ సమరంగా, ఒక దీర్ఘకాలిక క్యాంపెయిన్‌గా మారనుంది. ఫాసిస్టు, హంతక మోదీని, ప్రపంచంలో వారి సామ్రాజ్యవాద యజమానులనూ ఇది ఇంకా ఇంకా భీతావహులను చేస్తుంది. ఈ సందర్భంగా జరిగిన వందలాది కార్యక్రమాలలో ఈ విషయాన్ని ఉద్ఘాటించారు.

ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో ఉన్న భారత దేశ దౌత్య కార్యాలయం ఎదుట, మిలన్‌లో ఉన్న భారత కన్సులేట్‌ ఎదుట ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి అనేక మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. కార్మికవర్గ యూనియన్‌ సభ్యులుగా సంఘటితం అయి ఉన్న భారతీయ కార్మికుల ప్రతినిధులు ఒక సమావేశం నిర్వహించి భారత దేశంలోని పరిస్థితిని గురించి చర్చించారు. భారతదేశంలో యేడాదికాలంగా పోరాడుతున్న రైతాంగ ప్రజలకు వారు తమ సంఘీభావం ప్రకటించారు.

అతి ముఖ్యమైన విషయమేమంటే, ఒక సామ్రాజ్యవాద దేశంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ యూనియన్‌లో ‘స్లాయ్‌ కోబాస్‌” కార్మికులు నవంబర్‌ 24వ తేదీన జరుపుకున్న అనేక సమావేశాలలో భారత ప్రజా యుద్దానికి సంఘీభావంగా ప్రకటనలు చేసారు. ఇటలీలో ముందే ఈ క్యాంపెయిన్‌ జీ 20 శిఖరాగ్ర సమావేశానికి వ్యతిరేక నిరసనలతో ప్రారంభమయింది. మోదీ రోమ్‌కు వచ్చినప్పుడు నవంబర్‌ 27వ తేదీన లక్ష మంది మహిళలతో ప్రహార్‌ దాడిని వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన కూడా జరిగింది.

గెలీసియాలో కమిటీ చేపట్టిన అందోళనా కార్యక్రమంలో యావత్తు నగరాలూ పాల్గొన్నాయి. అలాగే స్పానిష్‌ స్టేట్‌లో మొట్టమొదటిసారిగా ఈ పిలుపును అనుసరించి వివిధ నగరాలలో యువ మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీలో అనేక నగరాలలో సభలు, భారీ గోడ రాతలు, బ్యానర్‌ల ద్వారా ప్రచారం జరిగింది. ఐర్లాండ్‌, గ్రేట్‌ బ్రిటన్‌, డెన్మార్క్‌ ఫిన్‌లాండ్‌, స్వీడన్‌, నార్వే, ఆఫ్టియా, ఫ్రాన్స్‌, కెనడాలలో కూడా ఇదే విధంగా జరిగింది. స్విట్టర్లాండ్‌లో ఒక ఫైటింగ్‌ అక్షన్‌ కూడా జరిగింది. దీన్ని కమిటీ ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నది.

సాలిడారిటీ బ్లాగ్స్‌ రిపోర్ట్‌లు, ఫోటోలతో ఈ క్యాంపెయిన్‌ను కమిటీ నిక్షిప్తం చేస్తున్నది.

ఉత్తర కుర్దిస్తాన్‌, సిరియాలలో యుద్ధ రంగంలో ఉన్న టర్మీ యోధులకు మద్దతుగా గొప్ప వేడుకలు జరిగాయి. ఇతర టర్కీ ఉద్య‌మ‌కారులు భారత ప్రజా విప్ల‌వ పోరాటానికి, ఫిలిపినో కామ్రేడ్స్‌కు ఒక బలమైన, గొప్ప సెల్యూట్‌ చేసారు. ఫిలిప్సీన్స్‌, భారతదేశాలలో ప్రజాయుద్దాలు ఎల్లప్పుడూ కలిసే సాగుతున్నాయి.

ప్రపంచ విప్లవ ఒకానొక ఎర్ర కేంద్రం అయిన బ్రెజిల్‌ నుంచి లాటిన్‌ అమెరికా సంఘీభావం వ్యక్తం అయింది. కొలంబియా, మెక్సికో, చిలీ, ఈక్వడార్‌లలో వివిధ రకాల సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి. అఫ్రికాలోని ట్యునీసియాలో ప్రజా విప్ల‌వ పోరాటాల‌కు మద్దతుగా ఎర్ర జెండా ఎగిసింది. ఈ ఖండంలో ప్రజాయుద్దానికి మద్దతుగా మార్గం తెరుచుకుంది. అఫ్రికావ్యాప్తంగా ప్రజా పోరాట మార్గాన్ని ఇది గుర్తించింది, ప్రారంభించింది.

అసియాలో ఆఫ్థనిస్తాన్‌, నేపాల్‌లలో అంతర్జాతీయ సంఘీభావ పవనం వీచింది. ఇతర అనేక దేశాలకు వివిధ రూపాలలో చేరుకుంది. మోదీని బలంగా సమర్థించే అమెరికా సామ్రాజ్యవాద గర్భంలో వివిధ రాష్ట్రాలలో భారతదేశం, ఇతర దేశాలలో ప్రజా పోరాటాల‌కు సంఘీభావం ప్రకటించారు.

అంతర్జాతీయ కమిటీ గడచిన పది సంవత్సరాలలో అందించిన మద్దతును, నవంబర్ 24ను సజీవం చేసిన ఈ పిలుపునూ ఎత్తిపట్టింది. భారతదేశంలోను, ప్రపంచంలోనూ కార్మికవర్గానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజానీకానికీ మధ్య సంఘీభావం ఏర్పడింది. ఇది ఆహ్వానించాల్సిన ప‌రిణామం.

2021 డిసెంబర్

అనువాదం: ప్రసాద్‌

Leave a Reply