అమ్మ 

అంతే మౌనంగా 

తన భుజాన్ని తనకు 

ఆసరాగా ఇచ్చిన 

సహచరిగా 

నిబ్బరంగా 

నిదానంగా తోడుగా 

నిర్బంధాన్ని ఎదుర్కొన్న

అమ్మతనమే తనది

విసుగు లేని

తన జీవనయానం

తెల తెలవారే 

చిరునవ్వుతో

ఉదయించే అమ్మ

సభలలో ఓ కాంతిరేఖ

నిరాడంబరంగా 

నిలకడగా తన తోవ 

వెనక నడచిన సహచరిగా 

ఎప్పుడూ గుర్తుండే 

అమ్మ తను

అమ్మలంతే 

ఆకాశంలో వెలితిని 

పూడ్చే వెలుగు రేఖలు

వారికేమిచ్చి 

రుణం తీర్చుకోగలం

మనసంతా నిండిన 

దుఃఖపు నివాళి తప్ప…

(కా.ఆలూరి లలితమ్మకు నివాళిగా)

One thought on “వెలుగు‌ రేఖలు

  1. 👍✊
    మా సత్యం
    కె క్యూబ్ రాసిన కవితా ‘వెలుగు రేఖలు’
    అద్భుతమైన భావావేశం. ప్రజా ఉద్యమాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి వారిరువురు వెలుగు రేఖ నీడై మన వెన్నంటే ఉంటారు.
    ఉద్యమ వందనాలు.

Leave a Reply