సాహిత్యం వ్యాసాలు

ప్లేటో కవిత్వ ద్వేషకుడా?

ప్లేటో కవిత్వాన్ని-కవులను వ్యతిరేకించేవాడని మనకు గ్రీకు సాహిత్యంతో కొద్దోగొప్పో పరిచయమున్నా తెలిసే ఉంటుంది. నిజానికి ప్లేటో గ్రీకు తాత్త్విక అభివృద్ధికి బీజాలు వేసాడని మనం చెప్పుకుంటాము. అయితే హెగెల్ వంటి ప్రముఖ తాత్త్వికుడు పారమనిడ్స్ అనే తాత్త్వికుడి   పారమార్ధిక చింతన తత్త్వం మాత్రమే తత్త్వశాస్త్రం అనే శాఖ అభివృద్ధికి మూలమైనదని వివరించారు. ఏమైనా పారమనిడ్స్   ఈ పారమార్ధిక చింతన   జడత్వ సారం అలాగే జెనో యొక్క గతితార్కిక ప్రయోగాన్ని ప్లేటో సమన్వయించి తన తత్త్వశాస్త్రపు పద్ధతిని అభివృద్ధి పరిచాడు(మరికొంత మంది తాత్త్వికుల తత్త్వాలని సైతం సమన్వయం చేసాడు). పారమనిడ్స్ గతిని-చలనాన్ని కేవలం భ్రమ అని ఈ విశ్వం అనాది-అనంతం