కథలు

వేగుచుక్క

ఆదివారం సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కుర్చీలో కూర్చున్న గోపాలరావు సిగరెట్‌ కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్లు విషాదంతో నిండి వున్నాయి. అతని హృదయంలో సుళ్లు తిరుగుతున్న దుఃఖం, వేదన ఏమిటో 40 ఏళ్లుగా అతనితో జీవితం పంచుకున్న జానకమ్మకు తెలుసు. జానకమ్మ అతడిని గమనిస్తూనే మౌనంగా అతడికెదురుగా కత్తిపీట ముందేసుక్కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నది. అతడు జానకమ్మను చూసాడు. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు కిందకు జారుతున్నాయి. అవి ఉల్లిపాయల ఘాటు వలన కాదని అతనికి తెలుసు. ఆమె మౌనం, కన్నీళ్ల వెనుక వున్న ఆవేదనను అతను అర్థం చేసుకోగలడు. ఆమెనలా చూస్తుంటే అతనికి గుండె