వ్యాసాలు

గులాం మహమ్మద్ భట్ కాళ్ళకి జిపిఎస్ బెల్ట్

యూఏపీఏ, తీవ్రవాద సెక్షన్ల కింద నిందితుడు, ఢిల్లీలోని ఎన్‌ఐఏ పాటియాలా కోర్టు దోషిగా నిర్ణయించిన గులాం ముహమ్మద్ భట్‌కు జమ్ము ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, అతని పాదాలకు జీపీఎస్ బెల్టును (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్- అతను ఎక్కడ వున్నాడో తెలియచేసే పరికరం) ధరించాలని ఆదేశం యిచ్చింది. అతని పాదాలకు ఆ బెల్ట్ వేశారు కూడా. ‘ది సండే ఎక్స్‌‌ప్రెస్’ తొమ్మిదవ పేజీలో ప్రచురించబడిన ఈ వార్త ఒక అధికారిని ఉటంకిస్తూ: "ప్రాసిక్యూషన్ చేసిన వాదన ఆధారంగా, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు, నిందితుడి కాలుకి జీపీఎస్ ట్రాకర్లను అమర్చమని జమ్ము, జమ్ము- కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తే