వ్యాసాలు

రష్యా , అమెరికా సామ్రాజ్యవాద వివాదమే ఉక్రెయిన్‌ యుద్ధం

చాలా సన్నద్ధత తర్వాత పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసింది.అమెరికా, దాని మిత్రదేశాలు దీనిని పుతిన్ సామ్రాజ్యవాద అత్యాశ పరిణామంగానూ, పూర్వ సోవియట్ యూనియన్‌ను పునరుద్ధరించే చర్యగానూ ప్రకటించాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ఈ ʹసైనిక ఆపరేషన్ʹ లుహాన్స్క్, డొనెట్స్క్ రిపబ్లిక్‌ల పైన ఉక్రెయిన్ దాడులను అంతం చేయడానికి ఉద్దేశించబడిందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దానితో పాటు ఇప్పుడు ఉక్రెయిన్‌లో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న నాజీ శక్తులను నాశనం చేయాలనుకుంటున్నానని రష్యా అంటోంది. వీటికి మించి తమకు వేరే ఏ లక్ష్యాలు లేవని రష్యా పాలకులు పేర్కొంటున్నారు. చెప్తున్నది యిదే  కానీ ఈ శక్తుల చర్యలు