వ్యాసాలు

జెఎన్‌యు పరిణామాలు – రాజకీయ ప్రాసంగికత

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికలు - నాలుగు సంవత్సరాల తర్వాత - ఎట్టకేలకు ముగిశాయి. వాటిలో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. ‘జెఎన్‌యులో మళ్లీ ఎరుపు వర్ణం పుష్పించింది’ అని వారు, వారి మద్దతుదారులు అంటున్నారు. అయితే ప్రతి పదవిలోనూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే తమలో విభేదాలు ఉన్న వామపక్షాలు మితవాదులకి భయపడి ఒక్కటయ్యారని, అయినా తమకు, వారికీ మధ్య తేడా చాలా తక్కువగా ఉందని అందుకే తమదే విజయమని అంటున్నారు. గతంలోలాగా విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఏబీవీపీ