ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్యస్య, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్యస్యస్ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్లో అధికారాన్ని