సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను
సాహిత్యం కవిత్వం

అమాయకులు వాళ్ళు

అవును, వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే, కానన కారుచీకట్లో వెలుగుకై వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు పచ్చని పంట పొలాలపై కార్పొరేట్ గద్దలు వాలుతుంటే, పంటను కాపాడే రైతన్న  వడిసెల విసురు నేరమైన చోట ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన  నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో హక్కుల నేతికై దేవులాడక ,  ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై దేబరించని అజ్ఞానులు వాళ్ళు.   కులం,మతం పేరుతో మానవత్వం మంటగలుస్తున్న మహోన్నత భారతంలో, హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్ దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక, బిర్శాముండా,కొమురం భీమ్ పంథానవసరంగా పట్టిన