వ్యాసాలు

ఆంగన్‌వాడీల జీవితాన్నిపరిచయం చేసిన పోరాటం

(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం ) మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే  వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్‌.హెచ్‌.ఏ - సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ