కాళీపట్నం రామారావు మాస్టారితో నా పరిచయం బహుశా 1967 జనవరిలో మొదలైందనుకుంటాను. అప్పుడు నా వయస్సు పదిహేను సంవత్సరాలు. తొమ్మిదో తరగతిలో నిలదొక్కుకుంటున్న సమయం. అదీ యువ దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చిన యజ్ఞం కధతో... కారా ఊరు మురపాక. నా బాల్యంలో కొంత భాగం గడిచిన మా అమ్మమ్మ ఊరు వెన్నంపల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులపల్లి చాలా చిన్న ఊరు. అప్పటి నా స్థితి- ఇప్పటికీ వదలని - పల్లెటూరి జీవితానుభవం... అత్యంత కౄరమైన భూస్వామిక దోపిడీ, పీడన - హింస, వివక్షతలో కూడా బతకడానికి నా చుట్టూ ఉన్న మనుషులు చేసే భీకర