వ్యాసాలు

బ్రాహ్మణీయ హిందుత్వ సాధనాలు  ద్వేషం, భయం, పెత్తనం, హింస

(త్వరలో విడుదల కానున్న పాణి వ్యాసాల సంపుటి ద్వేషభక్తి కి రాసిన ముందుమాట) గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే  ఇప్పుడు మరింత  గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది. 
వ్యాసాలు

కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే "కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు" (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి
కాలమ్స్ ఓపెన్ పేజీ

అందోళనాజీవుల కాలమిది

హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం)  హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది. అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష