వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో