అనువాదాలు సంభాషణ

‘అతని మరణం వారికి కేవలం ఒక గణాంకం మాత్రమే’

‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’ [ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.] స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి? ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట