సమీక్షలు

మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం

హుస్సేన్‌ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “'తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ 'అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్‌ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్‌ విప్లవోద్యమలో   వచ్చిన సాహిత్యాగానికి   ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక