సమీక్షలు

మనకు తెలియని శికారిలు

కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు "శికారీలు". మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా