వ్యాసాలు

బొగ్గు గనుల జిల్లాలోప్రమాదకర స్థితిలోజనజీవనం

మధ్య భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం మొదలుకాక ముందు, హస్దియో అరంద్ డజను ఆదివాసీ కుగ్రామాలు వున్న మారుమూల అడవి. 650 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిని "మధ్య భారతదేశ ఊపిరితితిత్తి" అని పిలుస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులతో పాటు, అమూల్యమైన నీటి నిల్వలు వుండేవి. స్థానిక గ్రామస్తులలో చాలా మంది ఆదివాసీలు లేదా గోండు తెగకు చెందిన "ఆదిమ నివాసులు". వారు తమ పెరట్లో పంటలు పండిస్తారు, నేసిన గడ్డి బుట్టలను మార్కెట్‌లో అమ్ముకొంటారు. వారికి తమ భూమి చాలా పవిత్రమైనది. హస్డియో అరణ్య అడవులలో, కొత్త బొగ్గు