సాహిత్యం కవిత్వం

విలక్షణ యుద్ధంలోకి..!!

ఇది పోయే కాలం కదా..ఇది పోగొట్టుకునే కాలం కదా.. అయిన వాళ్ళనూ..అంటుగట్టుకున్నోళ్ళనూ.. జ్ఞాపకాల సీసాలోకిమనసు గాయాలు మాన్పేఅమ్మఒడి స్పర్శగాతర్జుమా చేసుకునిఔషధంలా ఒంపుకునిబిరడా బిగించుకునిబరిగీసుకు బతుకుతున్నదినిజమే కానీ.. ఆస్తులో ఆత్మాభిమానాలోహోరెత్తిన హోదాలో..అందలాలో.. ఆలింగనాలో.. బంపర్ ఆఫర్లుగాకలిసొచ్చినకలసొచ్చిన వైరల్ రుతువులో..క్లియరెన్సు సేల్ ధమాకాలో.. ఒడిసి పట్టిననెత్తుటి త్యాగాల గద్దెలుతాకట్టు పెట్టినదగుల్బాజీ తనమా..?? ఏమైందనీఏమైపోయిదనీఇప్పుడెందుకీతలపోతంతంటావా.. వీళ్లంతానావాళ్ళనుకున్న నమ్మకం.. వీళ్ళుమాత్రమేనావాళ్ళనుకున్న భ్రమాతేలిపోయిందిప్పుడు..మనసు తేటబారిందిప్పుడు.. కురిసే మబ్బులకరచాలనం కోసంవొళ్ళంతా చిట్లినబిడ్డల నెత్తుటి చారలుత్యాగాలు తలకెత్తుకుని.. తలదాచుకునే మట్టిగోడలన్నీఎర్రమన్ను అలికితెల్లని ఆశలు విరబూసేసఫేదు సున్నపు ఛీటాల్లో.. హరివిల్లై విరబూసేహరియాలీలను దర్శిస్తూ.. మా అమ్మీలు పాడేచెక్కు చెదరని ఆశలమొహరం మాథంవిషాద గీతాలు భుజంమీద చెయ్యేసినన్నెప్పుడూఓదారుస్తుంటాయి.. ఆకురాలు కాలంఅడవి లేని
కవిత్వం

పోరుపతాక హోరును నేను..!!

కాలు మోపిన చోటల్లాఎద ఎండిన నదినైపగుళ్లిచ్చినప్రతిఫలనాల్ని దారి పొడుగునావొలక బోస్తూ..కన్నీళ్లతోకడుపు నింపుకున్నదాన్ని . శత్రు శతఘ్నులమోతల నడుమపుట్టుకతోనేకన్న తల్లినీ.. కడుపు చేత బట్టుకుతిరుగుడులో..తరాల తరుముడులో..సొంత ఇంటినీ..ఊరినీ..నేలనీ…జారవిడుచుకున్నదాన్ని..శకలాలు శకలాలుగాకుప్ప కూలుతున్నస్వప్నాల పెడ్డలకింద గుక్కపట్టిన శోకాలచివరి ఊపిరి తీసేచిన్నారి కళ్ళ అంచునరాజుకుంటున్నరాజిలేని గాజానో… హద్దుల నెరుగనినెత్తుటి హోళీలోకనికరమెరుగనికసాయి దాడులబూడిద గుట్టలు వారసమిచ్చివొరిగిన తల్లులసడలని పిడికిలిసత్తువ సావనిహమస్ శ్వాసనో… ఫిరంగి మోతలషహీదు బాటలత్యాగ తోరణాల్తయారు అన్నలిబియానో…లెబనాన్ నో… ఎవర్నైతే నేంఎప్పుడూ సడలనిఎక్కుపెట్టినఅక్కల పిడికిటిఆయుధాన్నేను… ద్విజాతుల దగాస్వజాతుల పగాలోకమంతా ఏకమైనానోరుమూయుడేశరణమన్నయుద్ధనీతుల బోధలల్లీబుజ్జగింపుల బురదదొక్కిగుండె మంటలుఆర్ప జూసినా.. నిప్పుకణికలహక్కు కుంపటిపోరు సెగనైసెంట్రి గాస్తా.. పుడమి నుదుటపొద్దుపొడుపుతిలకమయ్యీకలలు నిజమైగెలుపు గీతపురాగమయ్యీనడచివొస్తా… ఔనునాదైనచారెడు నేలకోసం..చావెరుగని నీడకోసం.. ద్రోహాల దోస్తానాలనెత్తుటి
సాహిత్యం కవిత్వం

అలల హోరుకు సంకెళ్ళేస్తావా..!?

సుఖమయ జీవితాల్లోని సంతోషాల్ని నిషేదించుకున్నోళ్లం గాఢాంధకారంలో చిక్కిన మట్టి బిడ్డలకోసం చిమ్మ చీకట్లను ఆలింగనం చేసుకున్నోళ్లం  నెర్రెలిచ్చి డొక్కలెండిన దుఃఖ్ఖ సాగరాల కనుకొలుకుల్లో కాంతి రేఖలమై పునర్జీవించినోళ్ళం శతాబ్దాల శుష్కవాగ్దానాలనీ పురోభివృద్ధి పాదాలకింద చితికినఆకలి పేగులమన్యానికి సైనిక కవాతునేర్పినోళ్ళం  అడవిని అన్యాక్రాంతం అవనివ్వని శపథాన్ని ఎరుపెక్కిన పతాక రెపరెపల్లో                                                         నిత్యం నిగనిగలాడే                                             నిఘా