కవిత్వం

భాష

వాళ్ల భాష ఏమిటో మనకు అర్థం కాదు తలలు విదిలిస్తూ చేతులు తిప్పుతూ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఎదలు గుద్దుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన దేహాల్తో వాళ్ళు ఏమంటున్నారో తెలువదు. చిన్నపిల్లలు సైతం చేతుల జెండాలు పట్టుకుని సైనికులకు ఎదురేగి ఏమంటున్నారో తెలియదు శిథిలాల మధ్య నిలిచి ఒరిగిపోయిన సీకుకు తన జెండానుగట్టి ఆ తల్లి ఏమని నినదిస్తున్నదో తెలియదు.. * మొరాకో ,ఈజిప్ట్ , జోర్డాన్ కెనడా, బ్రిటన్ మలేషియాల్లో వీధులు జన సంద్రాలై పోటెత్తుతున్నాయి . రాళ్లకు రాపిడైనట్లు సముద్రం ఘోషించినట్లు గుండెను డప్పు చేసి మంటలతో మాట్లాడించే వాళ్ళ భాషకు అర్థ మేమిటో తెలువదు అయితేనేం
కవిత్వం

కిటికీ

జైలు గదుల ఉక్కపోతల నుండి ఉపశమనం కోసం అతడు కిటికీ తెరిచాడు ఎదురుగా సముద్రం... బయటి సముద్రం లోపటి సముద్రం అలయ్ బలాయ్ తీసుకున్న చోట ఆకాశం నక్షత్ర కాంతుల వెదజల్లింది సహనానికి మారు పేరైన భూమి తన విముక్తి కోసం సంకెళ్లకు చేతులిచ్చి సహనంగా ఎదురుచూసే రేపటిలోకిచూపులు సారించే మానవ మహా సంకల్పానికి జే జే లు పలికింది
కవిత్వం

కాల్చిన బూడిద కుప్ప కింద

సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి
సాహిత్యం కవిత్వం

యుద్ధమాగదు

ఆ ఒక్క క్షణం కోసంయుగాలుగ ఎదురుజూసిందిఆ ఒక్క ఊహఆమెను పసిదాన్ని జేసింది అల్మయిరాలోపుస్తకాలు సర్దింది" మరణాన్ని తిరస్కరిస్తున్నా "వాక్యాన్నిపక్షిని జేసిభుజంమీద మోసుకుతిరిగింది.. గుండెనిండావసంతాలపొదుముకొనిగిన్నెనిండాబువ్వవొండుకొనివొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలనిమొగులుకోసం రైతుజూసినట్టుబిడ్డడి కోసం తల్లి జూసనట్టుగేటుకు కళ్ళ నతికించిఎంత ఎదురుచూసిందో అతడురాలేదుభయపడ్డట్టే జరిగిందిఊపిరి బిగబట్టే లోపుఊపిరాగినంత పనయ్యింది. ఆమెకూ అతడికీ మధ్యరాజ్యం..పూలరెక్కలమీదబుల్ డోజర్ నడిచింది మధ్య యుగాలకేసిముఖంతిప్పిన కోర్టుప్రజలకోసం కొట్టుకునే గుండెప్రమాదమన్నది****" అమ్మా..ఇక నాయినరాడా? "మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీఅంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టితెగుతున్నఆశల దారాల్ని పేనుతూమళ్ళీచౌరస్తాలో నిలబడ్దదామె.. యుద్ధ మాగదు..
సాహిత్యం కవిత్వం

పోతూ పోతూ

పోతూ పోతూమనంఇంత ఆస్తినీకాసిన్ని జ్నాపకాల్నీవారసత్వంగా ఇచ్చిచరిత్ర మడతల్లో అంతర్ధానమౌతాం పోతూ పోతూఅతడుశోకతప్త ఇంద్రావతి నీరగులుతున్న అడవినీశాంతి కోసం యుద్ధాన్నీవారసత్వంగా ప్రకటించి వెళ్ళాడు.. ముఖం లేనివాళ్ళ ముఖమైగొంతులేనివాళ్ళ గొంతైఅనాది ఆదివాసీ ఆర్తనాదమైమిగలాల్సిందేదోతగలబెట్టాల్సిందేదోప్రకటించి వెళ్ళాడు.. అతణ్ణి స్మరించడమంటేగాయపడ్డ పావురాన్నిప్రేమగ హత్తుకోవడమేగడీల మీదకుఫిరంగులు పేల్చడమే..నూతన మానవావిష్కరణకు ఎదురేగడమే 15-09-21
సాహిత్యం వ్యాసాలు

పంజరంతో ప‌క్షి యుద్ధం

ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. "  Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా  కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని  పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత
సాహిత్యం కారా స్మృతిలో

ప్రపంచ కథకుడు

నాకు బాగా ఇష్టమైన కథా రచయితలు ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాస్వేతాదేవి ఇంకొకరు కాళీపట్నం రామారావు. ఇద్దరి కథలని ఇష్టంగా చదువుకుంటాను. చాల సార్లు కథ రాస్తున్నప్పుడు ఎక్కడైనా తోచక పొతే వీళ్ళ పుస్తకాలలోకి తొంగి చుస్తాను. చిక్కులు కాస్త తొలిగి పోతాయి. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు నాకు రెడీరెకనర్ లాగ ఉపయోగపడుతుంటారు. వీళ్లిద్దరు నాకు సాహిత్యంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏదైనా కథ నచ్చాలంటే కథలోని ఇతివృత్తంతో బాటు కథ నడిపే తీరు కూడా నచ్చాలి. దాన్ని బట్టే కథలో readability పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలని సైతం పట్టుకోవడంలో వీళ్ళు ఇద్దరు సిద్ధహస్తులు. అంటే