కవిత్వం

ఎప్పుడైనా నేను గుర్తొస్తే!

ఎప్పుడైనా నేను గుర్తొస్తే కన్నీళ్లు పెట్టుకోకండి "కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది" అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి అక్షర రూపంలో నేనెప్పుడూ మీతో బతికే ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే మీ చుట్టూ ఉన్న జీవితాలు అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి మహిళల కోసం, ఆదివాసి హక్కుల కోసం ప్రజా పోరాటాలను చేయండి ఆ పోరాటంలో నేను మీకు తోడుగా ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే నా బట్టల కింద ఉన్న డైరీలో మీ కోసం రాసిన కవితలను మరోసారి మీ గుండెలకు హత్తుకోండి కాసేపు భారమైన బాధలను మర్చిపోతారు ఎప్పుడైనా నేను గుర్తొస్తే
కవిత్వం

మరువలేని క్షణం

ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది పాల కోసం తల్లడిల్లుతున్న ఆ బిడ్డను చూసి పాలకై తన రొమ్ములను ఎగేసి గుద్దుకున్న ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది రాజ్యం నేరస్తులను సత్ప్రవర్తనతో రిలీజ్ చేసినప్పుడు "బిల్కీస్ బానో" మనోవేదనకు కారణమైన ఆ న్యాయస్థాన అన్యాయాన్ని కన్నీళ్ళతో లెక్కించిన నిస్సహాయపు ఆ క్షణాల్ని ఎలా మరువగలం? ఓ నినాదం మన మస్తిష్కంలో మతాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలంతా మానవత్వాన్ని మరిచి మతానికై పరుగులు తీస్తున్నప్పుడు "బార్బీ మసీదు"లను కూలగొడుతున్నప్పుడు న్యాయం అన్యాయాన్నే మరలా అనుసరించినప్పుడు టీవీల ముందు కండ్లల్లో ఒత్తిడేసుకుని మనమంతా నోరు మెదపకుండా చూస్తున్న మతస్వార్థ మానవత్వపు ఆ క్షణాల్ని మనం
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు

1ఓ యుద్ధ ప్రకటన చుట్టూ గోడలపై వున్న అక్షరాలన్నీ ఏకమై మరో కొత్త యుద్ధాన్ని ప్రకటించినట్లు మూలకున్న ముసలవ్వలా ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ నా భుజాన్ని తట్టి ముందుకు నడిపినట్లు నాలోని కటిక చీకటికి ఎడిసన్ బల్బులు ప్రపంచాన్ని వెలిగించమని సైగ చేసినట్లు కాలువలై పారుతున్న నా కన్నీళ్ళను తుడవడానికి ఆ పాత పుస్తకాలే కదా! మరో కొత్త మార్గాన్ని చూపించే సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేశమంతా మతపిచ్చితో మారణహోమంలో మునిగిపోతుంటే మరెంత కాలం.... ఆ నాలుగు గోడల మధ్య స్వప్నపు కాంతులంటూ కలలు కంటావ్? లే.......! ఆ చీకటి ప్రపంచంలో నుండి బయటికి రా....
సాహిత్యం కవిత్వం

అమ్మ

అవును!!!నేను..ఎన్నిసార్లు పిలిచినావిసుగురాని పదం అమ్మ! ఎందుకంటే..మా అమ్మ అందరి అమ్మలాటీవీ ముందు కూర్చునివంట ప్రోగ్రామోకామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ! నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!మరిమా అమ్మ ఎలాంటి అమ్మ ? ఈ భూమి మీదఅరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూపంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ ! ఆకాశమంత దుఃఖంఅవనికి ఉన్నంత ఓర్పుమా అమ్మ సొంతం తన చెమట చుక్కల్నితన కన్నీటి గుక్కల్నితాగిన ఈ భూమిమా అమ్మకి ఎప్పుడు