పాట

విప్లవ జోహార్లు కటకం సుదర్శన

దండాలు దండాలు మా కటకమ నీకెర్ర దండాలు సుదర్శన జోహార్లు జోహార్లు మా కటకమ విప్లవ జోహార్లు సుదర్శన విప్లవానికే అంకితమైన...... యాభైయేండ్ల అజ్ఞాత జీవితమ..."దండాలు" కన్నాల బస్తిలో పుట్టినవు కారడవికి నీవు చేరినవు కామ్రేడుగా నీవు మారినవు కేంధ్ర నేతగా ఎదిగినవు నమ్మిన దారిలో నడిచినవు.... కన్నుమూసేవరకు పోరినవు...."దండాలు" మావోయిస్టు సిద్దాంతమా ప్రజాయుద్ధా మార్గానివీ గెరిల్లా పోరు వ్యూహానివి మాటు దాడుల మర్మానివి దండకారణ్యం గుండె కాయవు...... ఎర్రజెండా అరుణతారవు....."దండాలు" ఎర్ర దండు నడకవు నీవు పోరుబాట జాడవు నీవు ఉధ్యమాల ఊటవు నీవు విప్లవాల తోటవు నీవు అమర వీరుల కలలవు నీవు.... ఆశయాల బాటవు
సాహిత్యం కవిత్వం

పరాకాష్ట

చేతులకు సంకెళ్ళువేసినరాతను గీతనుఆపలేవుకాల్లకు సంకెళ్ళువేసినమా ఆటను అడ్డుకోలేవునోటికి సంకెళ్ళువేసినపాటను మాటనుప్రశ్నను ఆపలేవుఅక్షరం పై ఆంక్షలుశబ్ధం పై నిషేదంకదిలిక పై నిర్భందంమెదలిక పై నిఘాఅప్రకటిత చీకటిపాలనకు పరాకాష్టఇక మౌనం మండాల్సిందేశబ్ధం విస్ఫోటం చెందాల్సిందే