చంద్ర ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు. అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది. తన అమ్మ, నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది. గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు, ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి