గెస్ట్ ఎడిటోరియల్

ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంపై దాడి 

(ప్రాణాంతక ఇథనాల్ కంపెనీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి మద్దతుగా , ఆ ఉద్యమం పై రాజ్య హింసను నిరసిస్తూ చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన ఈ కీనోట్ ను ఈ సంచిక సంపాదకీయంగా ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం) చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్‍ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్‍ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా
వ్యాసాలు

కృష్ణా జలాల పంపిణీ, పునః పంపిణీ సాధిద్దాం 

ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు