(పీఆర్సీ సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవల గట్టి పోరాటమే చేశారు. కానీ ప్రభుత్వంతో చర్చల పేరుతో నాయకత్వం వంచించిందనే అభిప్రాయం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంతకూ చర్చల వ్యవహారం ఏమిటి? ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాల స్థితిగతులు ఏమిటి? అనే కోణంలో ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు రమణయ్య ఈ ఇంటర్వ్యూలో వివరిస్తున్నారు..- వసంతమేఘం టీం) 1. పి.ఆర్.సి. సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రభుత్వంతో చేసిన చర్చల లోగుట్టు ఏమిటి? “లోగుట్టు అంటూ ప్రత్యేకంగా అనకోవడానికి లేదు. అంతా బహిరంగ రహస్యమే. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలకనుగుణంగా వీరు మౌల్డ్ కావడము అందుకనుగుణంగా పాలకవర్గాలకు సహకరించినందుకు