తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు