వ్యాసాలు

హమాస్‌ దాడులను ఎలా చూడాలి..?

‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది. వాకిలి నీదైనా నాదైనా, దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా అది ఆదాము నెత్తురే కదా యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. గాయపడేది మానవాత్మే కదా మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ అంటూ 1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు. నిజమే కదా యుద్ధ భీభత్సం