వ్యాసాలు

ప్రజల ప్రజాస్వామ్య ప్రతిఘటనను  దెబ్బతీసేoదుకై   మారణహోమ సైనిక విధానం

బస్తర్ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తమ భూమిని, జీవితాలను, ప్రకృతి వనరులను దోచడమే గాక, తమ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులను బస్తర్ తీవ్రంగా ప్రతిఘటించింది. అలాంటి తిరుగుబాట్లలో 1910 లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  భూంకాల్ తిరుగుబాటు ఒకటి. గుండాదుర్ అనే ఆదివాసీ నాయకత్వాన ఆదివాసీలు వలసవాదుల అటవీ మరియు ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నాటినుండి నేటిదాకా, బస్తర్ లో లభించే అపారమైన ప్రకృతి వనరుల దోపిడీకి వేచి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల రక్షణకై ప్రభుత్వo చేస్తున్న సైనికీకరణను, బస్తర్ ప్రజలు సాయుధంగా ఎదుర్కొంటూనే వున్నారు. పూనెం సోమ్లి ఒక