ఆర్ధికం

ఆహార నిల్వలున్నచోట  అకలి కేకలు

 ఎ.నర్సింహారెడ్డి           వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట
వ్యాసాలు

బోనులో మోడీ సర్కార్‌

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' ''ది బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్టు పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్‌ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్‌ కోసం ఎన్‌ఎస్‌వోతో
ఆర్థికం

కార్పొరేట్ల గుప్పిట్లోకి బ్యాంకులు

గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్టీస్‌ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌
కాలమ్స్ ఆర్ధికం

విస్ఫోటనంలా నిరుద్యోగం, పేదరికం

నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌
కాలమ్స్ ఆర్ధికం

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
వ్యాసాలు

వ్యక్తిగత గోప్యతకు తూట్లు

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగియక ముందే మరో వివాదస్పద అంశం కొత్తగా ముందుకొస్తున్నది. ఇప్పుడు “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు(పిడిపిబి) 2021” పేరుతో మరో వివాదం ముంచుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారత్‌ సంతకం చేసింది. ఏడు దశాబ్ధాలు గడిచినా ఆమేరకు పటిష్ట చట్టాన్ని రూపొందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి 128 దేశాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే
కాలమ్స్ ఆర్ధికం

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

పెరిగింది కొండంత – తగ్గింది గోరంత

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది.
వ్యాసాలు సమకాలీనం

ఆకలి కడుపులతో అమృతోత్సవం!

బ్రిటీష్‌ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది  పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత
కాలమ్స్ ఆర్ధికం

శ‌ర‌వేగంగా పెరుగుతున్న అస‌మాన‌త‌లు

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని