తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు. సమానత్వాన్ని, లౌకిక తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా