భారత విప్లవోద్యమంపై ప్రభుత్వ దాడికి వ్యతిరేకంగా నవంబర్ 24న ప్రపంచ దేశాల్లోని ప్రజాస్వామిక వాదులు స్పందించారు. విప్లవ ప్రజా పోరాటాలను నిర్మూలించడానికి ఇటీవలే భారత పాలకులు ప్రారంభించిన నూతన ప్రహార్-3ని నిరసిస్తూ “ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా” (ఐసీఎస్పీడబ్య్యూఐ-భారత ప్రజాయుద్ధానికి మద్దతుగా అంతర్జాతీయ కమిటీ) పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనేక దేశాలలో చాలా క్రియాశీలంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఇటలీ నుండి టునీషియా వరకు, ఈక్వడార్ నుండి కెనడా వరకు, అమెరికా నుండి జర్మనీ వరకు, బ్రెజిల్ నుండి డెన్మార్క్ వరకు, కొలంబియా నుండి నార్వే వరకు, స్పెయిన్ నుండి స్విట్టర్లాండ్