యాప నారాయణ హరిభూషణ్గా ఎదిగిన క్రమం మనసు తెరమీద రూపు కడుతున్నది. మానుకోట దొరల గడీల చుట్టూ మర్రి ఊడల కింద మొలిచిన గడ్డి మొక్కలు ఆంబోతులను బంధించిన ముకుతాళ్లలో బిగిసిన పిడికిళ్లు గుర్తుకొస్తున్నాయి. ఆదివాసి జీవితం ఒక విప్లవ పాఠశాల అయిన క్రమం వరంగల్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ విద్యార్థిగా జ్ఞానం అంటే రాడికల్ మార్పు అని నేర్చుకున్న చదువులు. అప్పటి అధ్యాపకులు అందరు ఆ విద్యార్థుల దగ్గరే నేర్చుకున్నామన్నారు. సమాజాన్ని చదువుకోవడం. ఖమ్మం జిల్లాలో చేపట్టిన విప్లవోద్యమ విస్తరణ, తెలంగాణా మీదుగా దండకారణ్యం దాకా రెండడుగులు నాలుగు అడుగులుగా నడిచింది. రెండు గుండెలు ఒక దండోరాగా