వ్యాసాలు


చట్ట బద్ధ పాలన అడిగినందుకే సాయన్న జైలుపాలు

కొల్లూరి సాయన్న ... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సుందరగిరి గ్రామంలో దళిత రైతు కుటుంబం లో పుట్టాడు. న్యాయశాస్త్ర విద్యార్ధిగా విద్యా రంగ సమస్యలపై పని చేశాడు. చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరేలా, తెలంగాణా గ్రామీణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం , ఆదివాసీ ప్రజల కోసం పని చేయాలని ఐదేళ్ల క్రితం నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్త సాయన్న. నిత్య అధ్యయనంతో వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన పెంచుకుని వివిధ జిల్లాలకు తన పనిని విస్తరించుకుని తెలంగాణా రైతాంగ సమితి నాయకుడుగా ఎదిగాడు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా,