కవిత్వం

కొన్ని ప్రశ్నలు

ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు. నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం. నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు. విరిగిపోతున్న అనుభవాల సమూహం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలు లెక్కడివి? ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య మసిబారుతున్న జీవన కాంతుల మధ్య తుఫానుల విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి? ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు? 1 సందేహాల మధ్య, చావుబతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ కరుగుతున్న జీవితాలు. ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు. 2 దూరం దూరం మనిషికీ మనిషికీ మధ్య