సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత