పత్రికా ప్రకటనలు

శిశువును చంపిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ముత్వెండి గ్రామంలో 2024 జనవరి 1న మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 6 నెలల పసికందు మృతి చెందిందని మూల్‌వాసి బచావో మంచ్ (బస్తర్) చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లోనే మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్‌ అంటుంటే, మావోయిస్టులతో ఎలాంటి ఎన్‌కౌంటర్‌ ఘటన జరగలేదని మృతి చెందిన చిన్నారి తండ్రి సోది ఆరోపించారు. ఓ హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన బిడ్డకు ఆహారం పెడుతున్న మస్సీ వడ్డెపై అడవి నుంచి వచ్చిన భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు