‘‘ఇక మాటలు అనవసరం, కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం, విప్లవాత్మక దృక్పథంతో రచనలు చేయాలి’’ - శ్రీశ్రీ (8.10.1970 విరసం రాష్ట్ర మహాసభలు-ఖమ్మం) ఇప్పటివరకు అటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కార్యశూరత్వం చూపటంలేదు. అసలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే కవులే పలచబడుతున్నారు. మరి ఎవరు మట్లాడాలి. మాట్లాడుతున్నది అతి తక్కువమందే కావచ్చు..కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే..ప్రశ్నించకపోతే..గొంతెత్తి రణన్నినాదం చేయకపోతే రాజ్యం చేసే క్రూరత్వం రెట్టింపవుతుంది. ఇవాళ దేశంలో స్త్రీలు, దళితులు ఆర్థిక రాజకీయ దోపిడీలకు గురౌతున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ముసలిభారతంలో సాంఘిక అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరే. ఆర్థికదోపిడీ వల్ల పేదమధ్యతరగతి జీవితాలు దుర్భరమైపోతున్నా ప్రశ్నించకూడదా..? హక్కులకై కలబడకూడదా..?