వ్యాసాలు

కథలవనం ఎండిపోయింది..

ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని