కవిత్వం

ఇది‌ తల్లుల దేశం

ఆ తండ్రి పోరాట వారసత్వంఆమె ముని వేళ్ళ గుండావారి దేహమంతా ప్రవహిస్తూఈ దేశ భవిష్యత్ చిత్రపటాన్నిదేదీప్యమానంగా చిత్రిస్తోంది తను కన్నది వాళ్ళిద్దరినేవారు నిర్మించిందివేలాది విముక్తి సైన్యాన్ని బిడ్డల కోసంనెత్తుటి ధారలావర్షించిన తల్లి ప్రేమఒకవైపు నేల తల్లి విముక్తిసాధనలో వారున్నారన్నభరోసా మరోవైపుతనను నిటారుగానిబ్బరంగా నిలబెడుతూవచ్చాయి ఒకరు ఒరిగినాతనందించినజెండా ఎత్తుకున్నమరో బిడ్డచూపులకు కానరాకపోయినాఆ రెపరెపల వెచ్చని గాలితన నూరేళ్ళ శ్వాసయింది అమ్మలెప్పుడూ అంతెఒక కంట్లో సూరీణ్ణిమరో కంట వెన్నెలనీవిరబూయిస్తారు అమ్మలంతేతమ పచ్చని కొంగుతోదేశానికి తల్లులవుతారువీరుల‌ గొంతులోచనుబాలధారలవుతారు అమ్మలకు మరోమారునమస్కరిద్దాం (వీరమాత మల్లోజుల మధురమ్మకు వినమ్ర జోహార్లతో)
సాహిత్యం కవిత్వం

పిచుకలకు రెక్కలొచ్చే వేళ

సాయీనీతో పాటుగా ఇంతమందిమాటాడుతుంటే వాడికేదో భయం కదా చావు నీ ముందు కరాళనృత్యం చేసినానీ గుండె చెదరలేదునీ నిబ్బరం వెనక వున్ననమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా? నీ మాటా నీ నవ్వే వాడినిబెదరకొడుతూ వున్నాయా? ఎందుకో మాటాడే వారంటేచెదరని నవ్వుగలవారంటేరాజుకెప్పుడూ భయమనుకుంటా ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా నువ్వెప్పుడూ అంటావు కబీరునిఆలపించమనిమనుషుల్ని ప్రేమించమని కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూదేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు న్యాయానికి గంతలు కట్టి‌న్యాయమూర్తుల గుండెలపైఉక్కుపాదం మోపితీర్పులను తిరగరాయిస్తున్నాడు చీకటిని తెరచే ఉషోదయమొకటివేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది పిచుకలకు రెక్కలొచ్చినిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతోదూరంలో లేదు బాబా !! (సాయిబాబా విడుదల కోరుతూ)
సాహిత్యం కవిత్వం

మరో వైపు..

ఊరికేనీ ఇంట్లోకి చొరబడినీ పసిపాపల ముందునిన్ను పెడ రెక్కలు విరిచి కట్టిబలవంతంగా ఎత్తుకు పోతారు ఎక్కడో నువ్వొక సారిఎమోజీగానవ్వినందుకునీ మిత్రులతో కలిసిగొంతు కలిపినందుకునీ చేతిలోపచ్చగా ఓ రుమాలుఎగిరినందుకుఏమైనా కావచ్చునీ నుదుటిపై ఊపాముద్ర వేయడానికి ఇక నీ కను రెప్పల చుట్టూఇనుప చువ్వలు మొలకెత్తుతాయినీ గుండెలపై ఊపిరిసలపనంతగాఉక్కు పాదంతో తొక్కిపెట్టడానికిరోజు లేమీ మిగిలి వుండవు నీ పసిపాపల‌ నవ్వుల కేరింతలువినపడకుండా గాజుటద్దాలుఉబికి వస్తాయి నీ ఇంటి మీదకుబుల్డోజరు నడిచి వస్తుంది అనుమానపు పరిహాసాలతోచుట్టూ పరిక కంపలుపరచుకుంటాయి ఎప్పటికో ఒక వేకువలోమెలకువ వచ్చినన్యాయ పీఠం నిర్దోషిత్వాన్నిగుర్తిస్తూ నీ ముఖాన ఒక‌బెయిల్ కాగితం విసిరి కొడితేఅందుకోలేని నీ వణుకుతున్నచేతులు చివరిగా ఆసరానువెతుక్కుంటూ బయటకు
కవిత్వం

ఎవరిదీ జెండా

దేశమంతా సంబరాలపేరుతో మాయల ఫకీరుఉచ్చులో ఊరేగుతున్న వేళ దాహమంటూ గ్లాసుడునీళ్ళు తాగితేకొట్టి కొట్టి చంపినఅపర బ్రహ్మలున్న చోట అమృతమెవడిదోవిష పాత్ర ఎవరిదోబెత్తంతో గిరిగీసినపంతుళ్ళకుఏ శిక్షా లేని చోట నీ ఇంటి మీదఏ జెండా ఎగరేయగలవుచిన్నోడా! కులమొక్కటేమతమొక్కటేఏక్ భారత్శ్రేష్ఠ భారత్అని కూస్తున్నమర్మాల మర శబ్దాలనడుమనీదీ నాదీకాని దేశం కదాఇది తొమ్మిదేళ్ళ నీచిన్ని గుండెపైమండిన అగ్ని కీలలుఆ చూపుడు వేలుచివరల మండుతూఎగసిపడతాయాఏనాటికైనా? (కుండలో నీళ్ళు తాగి చావుకు గురైన ఇంద్రా మేఘవాల్ కు క్షమాపణలతో)
కవిత్వం సాహిత్యం

వెలుగు‌ రేఖలు

అమ్మ  అంతే మౌనంగా  తన భుజాన్ని తనకు  ఆసరాగా ఇచ్చిన  సహచరిగా  నిబ్బరంగా  నిదానంగా తోడుగా  నిర్బంధాన్ని ఎదుర్కొన్న అమ్మతనమే తనది విసుగు లేని తన జీవనయానం తెల తెలవారే  చిరునవ్వుతో ఉదయించే అమ్మ సభలలో ఓ కాంతిరేఖ నిరాడంబరంగా  నిలకడగా తన తోవ  వెనక నడచిన సహచరిగా  ఎప్పుడూ గుర్తుండే  అమ్మ తను అమ్మలంతే  ఆకాశంలో వెలితిని  పూడ్చే వెలుగు రేఖలు వారికేమిచ్చి  రుణం తీర్చుకోగలం మనసంతా నిండిన  దుఃఖపు నివాళి తప్ప... (కా.ఆలూరి లలితమ్మకు నివాళిగా)
సాహిత్యం కవిత్వం

కవాతు..

ఇప్పుడు ఒక నిశ్శబ్దంకమ్ముకున్నది దుఃఖమొక్కటేభాషగా మారింది ఎవరికి వారుమౌనంగాసంభాషిస్తున్న సమయం చిరునవ్వుల సితారాపల్లవించనివిషాద సందర్భం మీరలా చేరగిలబడినఆ మద్ది వృక్షంవిషాద సంకేతంగారాల్చిన ఆకులనుమీ దేహం పై వేస్తూ మీరు దాహంతీర్చుకున్న ఈ సెలయేరుదుఃఖిస్తూ ఉప్పగా మారింది మీతో కలిసి పాడినపక్షుల గుంపులుమౌనంగా రోదిస్తున్నాయి యుద్ధానికి సంకేతంగామారిన సాకేత్ దాదాఎక్కడని కుందేళ్ళగుంపు అడవినంతాగాలిస్తున్నాయి శతృవు గుండెల్లోపేలిన ప్రతి తూటానెత్తురంటినకంటితో వినమ్రంగావిప్లవ జోహార్లర్పిస్తున్నాయి మీరు నేర్పిన నడకతోవిస్తరించి సరిహద్దులనుచెరిపేసిన ప్రజా పంథాకన్నీటిని ఒత్తుకుంటూఎర్రజెండాను ఎత్తిపట్టింది వీరునికితంగేడు పూల మాలలతోవీడ్కోలు పలుకుతూకదులుతోందిప్రజా యుద్ధ కవాతు.. (కామ్రేడ్ ఆర్కే స్మృతిలో)
కాలమ్స్ కవిత్వంలోకి

నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి

కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది.  వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు  ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై
కవిత్వం

ఎన్నెల కల

నడుస్తూ మాటాడుకుందాం నడకాగితే మాటాడలేను ఈ రాతి పలకల మీద  చెంగున దూకి జారే ఆ పిల్లల లేత పాదాలను తాకి మాటాడుకుందాం ఎన్నెన్ని ఎన్నెల రాత్రులలో వెలిగిన ఈ నెగడు చుట్టూ కలబోసుకున్న కథలలో ఎంత దుఃఖం దాగి వుందో మరొకసారి మాటాడుకుందాం ఎత్తైన ఈ పచ్చని కొండలపై పహరా కాస్తున్న మేఘాల నడుమ సెంట్రీ కాస్తున్న ఈ పిలగాళ్ళ చూపులను దొంగిలించే  ఆ తోడేళ్ళ ద్రోన్లను కూల్చే  వడిసెల కథ చెప్పుకుందాం  ఒకసారి సూరీడా సూరీడా  త్వరగా రారమ్మని  పిలిచే ఆ తల్లి  ప్రసవ వేదన  అరణ్యమంతా వినిపించే  గాధ కదా  రా అలా లేలేత
కాలమ్స్ కవిత్వంలోకి

కొంచెం స్వేచ్ఛ కోసం క‌వితాలాప‌న

“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafaచాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ
సాహిత్యం కవిత్వం

కదిలే కాలం..

ఎప్పుడో ఏదో ఒకక్షణాన కమ్ముకున్న చీకట్లుతొలగిపోక మానవు రాబందుల రెక్కలలోచిక్కిన పావురాలుఆకాశంలో ఎగరక మానవు వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డమణికట్లు మరల పిడికిలెత్తిఅభివందనం చేయక మానవు ఓరిమితో ఎదురు చూడాలిసమయమింకా ముగిసి పోలేదుఅందరమూ మరొకసారికలుసుకొని కదిలే కాలమే ఇది!! (దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)