వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ
వ్యాసాలు

మతవర్గ తత్త్వం

(జనవరి 10 , 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల ప్రసంగ పాఠంలోంచి కొంత భాగం - వసంత మేఘం టీం ) ...ఐతిహాసిక ,  పౌరాణికాంశాలను వదిలి, చరిత్రలో మధ్యయుగాలకు సంబంధించిన మతపరమైన యుద్ధాలకూ మారణదారుణాలకూ వస్తే, వాటి కారణాలు కేవలం మతంలోనే లేవని తేలుతుంది. మతసంస్థలకు చెందిన ఆస్తిపాస్తుల విషయంలో, రాజపోషణవల్ల సమకూరే శుద్ధభౌతిక సదుపాయాల విషయంలో, భూస్వామిక సమాజంలోని హెచ్చుతగ్గుల విషయంలో వచ్చిన సామాజికమైన పోటాపోటీలు మత విరోధాల రూపం పొందిన సందర్భాలు ఒకటీ రెండూ కాదు. బ్రాహ్మణ మతం ఎన్నడో గతించిపోగా, బౌద్ధాన్ని చావగొట్టిగానీ చచ్చుపార్చిగానీ హైందవం తన ప్రాబల్యం స్థాపించుకున్న తర్వాత