తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పుకుంటున్న గురుకులాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలలు, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టళ్లు పేద విద్యార్థుల పట్ల శాపంగ మారాయి. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు వందలలో నమోదు కాగా వేల మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యం బారిన పడినారు. ఈ పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉంది. ఫుడ్ ఫాయిజన్ ఘటనలతో పాటు ఈ జిల్లాలలో ఆగస్టు నెలలో ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకులాలలో జ్వరంబారిన పడి నలుగురు విద్యార్థులు చనిపోవడం