వ్యాసాలు

జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థినుల పోరాటం

ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న జెండర్ వివక్షతను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు సంఘీభావం ప్రకటించి అండగా నిలవాల్సిన భాద్యత మనందరిపై ఉంది.మార్చి నెల ప్రాంరంభంలో హౕస్టళ్ళలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రారంభమైన విద్యార్థినుల ఉద్యమం నేడు స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం వైపు ప్రయాణం చేస్తూ తెలంగాణ సమాజం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ వైపు మరోసారి చూసే పరిస్థితి నెలకొంది.మార్చి 27 నాడు మద్యాహ్నం నుండి లేడిస్ హస్టల్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరవధిక దర్నాలో మద్దతుగా మేము పాల్గొన్నపుడు విద్యార్థులు లేవనెత్తిన అంశాలు మమ్మల్ని పోరాటంలోకి కదిలించాయి.ఆ దర్నాలో పాల్గొన్న విద్యార్థినులు వారిపై ఏ విధంగా అణచివేత సాగుతున్నదో చెబుతుంటే
వ్యాసాలు

సంక్షేమ హౕస్టళ్ళు, గురుకులాల భ‌విత‌వ్యం?

కోవిడ్  సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రత్యక్ష విద్యబోధ‌న  ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలత చెందిన కొంత మంది తల్లిదండ్రులు, వ్యక్తులు సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నిలిపివేయాలని పిల్ వేశారు. ఆగస్టు 31 నాడు అత్యవసరంగా హైకోర్టు బెంచ్ పాఠశాలల ప్రారంభంపై విచారణ జరిపి గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళను మినహాయించి మిగిలిన విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతినిచ్చింది.అదే సమయంలో గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళలో కోవిడ్ నిబంధనలు అమలుపై, అక్కడి వసతుల కల్పన, కనీస సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురుకులాలో, సంక్షేమ హౕస్టళ్ళలోని విద్యార్థులు నివసించే గదులలో కోవిడ్ నిబంధనలు అమలుకు ఏమాత్రం అవకాశం
సాహిత్యం వ్యాసాలు

డిజిటల్ పాఠాలు పేద విద్యార్థులకు చేర్చడంలో పాలకులు విఫలం

అంతర్జాతీయ కరోనా విపత్తు వలన గత ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యభోదన ప్రత్యక్ష తరగతిగది విధానంలో కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో జరుపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే తరగతుల భోదన ఉంటుందని విద్యశాఖ స్పష్టం చేసింది. అయితే రూపంలో డిజిటల్ విద్యభోదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సారంలో డిజిటల్ తరగతులు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది నేడు మనందరి ముందున్నట్టి ప్రశ్న. వేల సంవత్సరములుగా మన దేశంలోని శోశితజనసమూహౕలపై జరుగుతున్న సామాజిక,ఆర్థిక అణచివేత వలన నేడు మెజారిటీ ప్రజలు డిజిటలైజేషన్ ఫలితాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. తరగతిగదిలో ప్రత్యక్ష భోదనకు స్కూల్ బిల్డింగ్, టీచరు, బెంచీలు,
సాహిత్యం వ్యాసాలు

ఆన్ లైన్ విద్యతో పెరిగిన డ్రాపౌట్లు

అంతర్జాతీయ కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO) ప్రకటించింది. మార్చి 20,2020 నాడు దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి.అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్ లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి.గ్రామీణ ప్రాంతాలలోని,పట్టణ ప్రాంతాలలోని యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు,కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు.వీరి చదువులు నిలిచిపోయాయి.తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల