సాహిత్యం కవిత్వం చేతనాస్తిత్వం January 17, 2022January 17, 2022 కోడం పవన్ కుమార్0 సంధ్యాకాశంలో కదులుతున్న సూర్యుడు చేతనలోంచి అచేతనలోకి వెడుతున్నాడు దూసుకొస్తున్న పున్నమి చంద్రుడు సుషుప్తిలోంచి సృజనలోకి వస్తున్నాడు నుసిలా రాలుతున్న చీకటిని కప్పేస్తున్న వెన్నెల వెలుగు దూరంగా వెలుగుతూ మలుగుతున్న చుక్కల రాయబారం ఘనీభవించిన నిద్ర మీద నిప్పురవ్వలా జ్వలిస్తున్న కలల దీపం ముఖం వాల్చిన పెరటితోటలోని పొద్దుతిరుగుడు పువ్వు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావి గిరక మీద కూర్చున్న ఊరపిచ్చుకల కిచకిచలు అస్తిత్వం చేతనమై కురుస్తున్న వాన చినుకులు చీకటిలోంచి తొంగిచూస్తున్న వెలుగురేఖల దృశ్యం దూరపు కొండలను స్ఫృశిస్తూ సంక్షోభంలోంచి స్పష్టతలోకి సంక్లిష్టతలోంచి సంఘర్షణలోకి సందేహంలోంచి సందోహంలోకి జ్వలిస్తున్న సూర్యుడు Read More