2022 జనవరి 14న ఈ ఘటన జరిగింది. ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాల తమలపాకు రైతులపై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుకపడ్డాయి. వాళ్లను తోటలకుకు వెళ్లకుండా అడ్డంపడ్డాయి. అక్కడితో ఆగలేదు. ఘోరంగా లాఠీ చార్జి చేశారు. పైకి కనిపించే ఈ ఘటన వెనుక చాలా కథ ఉంది. దాన్ని తెలుసుకోడానికి నిజనిర్ధారణకు దేశంలోని పలు పౌరహక్కుల సంస్థలు, వేదికలు 2022, జనవరి 29-30 న వెళ్లాయి. ఇందులో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO) సభ్యులు ఏడుగురు, గణతంత్రిక్ అధికార్ సురక్ష్య సంఘటన్ (GASS) సభ్యులు