సమీక్షలు

చరిత్ర పుటల్లోకి ..పోరాట దారి మలుపే ‘తిరుగబడు’ కవిత్వం

'తిరుగబడు' కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు  తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. " ఇలా వచ్చి అలా వెళ్లిన 'తిరుగబడు కవులు...' " శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది. దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని  కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది. దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను  పదునైన మాటల్లో వర్ణించారు. కాని