మాష్టారూ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి' అని మాటిచ్చి ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్యగలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే