కవిత్వం

కళ్ళలో ఒక నది

కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి  లోపలి మనిషి ఒక్క సారి బహిర్గత మౌతుంటాడు అంతర్ధానమౌతున్న  విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వంగా దివ్య రేఖలు అద్దుతుంటాయి  చెదిరిపోని  ఊహలు గూళ్ళను నిర్మిస్తాయి  అల్లుకున్న తపనలు చిగురులు తొడుక్కుంటాయి  ఒక దాహం నది తీర్చినట్లు ఒక ఎండని చెట్టు ఆపినట్లు కాలం దొంతరల్లో ఒక ప్రయత్నం ఎన్నో కాంతుల్ని విసురుతుంది  శ్రమ ఉదయించడం లో విజయాలు తడుతుంటాయి అక్షరాల కాంతి లో ఇలా రేపటి స్వప్నాలని నిర్మించుకుంటూ .. అడవి పూల సౌందర్యాన్ని పారే నదీ ప్రవాహాల్ని
సాహిత్యం కవిత్వం

అంతే బాధలోంచి

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను గాయపడిన అనుభవాలలోంచికొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను కొంత ప్రయాణంలోనిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి కాలాన్ని ఎదురీదడమంటేమార్పులను అవగతం చేసుకోవటమే దారులు ఇరుకవుతున్నప్పుడుఆలోచనలు పదునెక్కాలి ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసిఅనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసిఅనేకానేకాలుగా దర్శించాలి చీమ బలం చూసికన్నులెగరేసిఆకాశాన్ని ఎత్తగలంఆకాశం పైకి ఎక్కగలం లక్ష్యం కుదుపుతున్నపుడురహ దారులు ఇట్టే చిగురిస్తాయి ఊహకు రూపం ఇవ్వడమంటేకొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే . ఇప్పుడు అంతే బాధలోంచి లేచితీరాలకి చేరిఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచిచినుకుల్లా కురిసిన ఒక నేను .
కవిత్వం

వర్షం లో రైతు

వాలే చినుకు లోఆశగా తడిశాను .బురద సాలుల్లో నారుగా మురిసాను .ఎండిన కలలని తడుపుతూవడివడిగా దున్నుకుంటున్నాను .ఎండలు శపిస్తాయోవానలు ముంచేస్తాయోకళ్ళనిండా  మేఘాలునిండి ఉన్నాయి .గుండెనిండా ధైర్యంపిండుకున్నాను .కాసింత ఉరుములు  భయపెడతాయికాసిన్ని పిడుగులు కూల్చేస్తాయికాళ్ళు మట్టి పెళ్ళల్లోఉదయించందేమనసు కుదుటపడదు .రెప్పల వాకిట్లోతెప్పలుగా కదిలే దృశ్యాల వెంటఆకు పచ్చని కలలుఊరటనిస్తాయి.ఊపిరి పోసినాఊపిరి తీసినామట్టిని నమ్ముకునేరైతు  జీవితం ముగుస్తుంది .