కవిత్వం

కవితా పరాగం

కిటికీ కవితలు - 1 ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..ఏదో కాసింత గాలీ , వెలుతురు ఇస్తుందని ప్రేమ దానిపై..కానీ ..నాకనిపిస్తుంది..కిటికీకి దేహం ఉంది.హృదయమూ ..కళ్ళూ ఉన్నాయి.అది ఎలా చూస్తుందనుకున్నారు?బయట భళ్ళున తెల్లవారటాన్ని?లోపల ..కలలు కరిగి కన్నీరైన చీకటి రాత్రుళ్ళని?కిటికీకి ఉపిరితిత్తులున్నాయి..గది లోపలి మనుషుల ఆశ నిరాశలను…ఊపిరాడ ని ఉక్కిరిబిక్కిరి తనాలను తను కాదూ శ్వాసించేది..శ్వాసఇచ్చేది? కిటికీ..ఒకసారి అమ్మ అయిపోయి..మరోసారి నాన్నగా మారి పోతుంది.కిటికీ ..తనని పట్టుకుని వేలాడే మనుషుల దుఃఖంతో….దీర్ఘ సంభాషణ చేస్తుంది… వాదోపవాదాలు చేస్తుంది.రెక్కలు చాచి..ఒంటరి మనుషుల్ని కావలించుకుంటుంది.అమ్మ దేహం మీది వంటింటి వేడి సెగలని.. చమట ను చల్లని గాలితో చల్ల బరుస్తుందివిరహాన వేగిపోయే