(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయన తత్వశాస్త్ర ఆచార్యుడు. విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేవాడు. ప్రజల దగ్గర పాఠాలు నేర్చకోడానికి యూనివర్సిటీని వదిలేశాడు. నేర్చుకోవడం అంటే నేర్పించడం అనే గతితర్కం తెలిసినవాడు. ప్రజలకు రాజకీయాలు నేర్పించాడు. ఆయనే పెరూ విప్లవ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్రజా యుద్ధ మార్గదర్శి. పథ నిర్దేశితుడు. ఆయన నాయకత్వంలో పెరూ ప్రపంచ పీడిత వర్గానికి ఆశారేఖలాగా వెలుగొందింది. ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి అమెరికా, పెరూ పాలకవర్గాలు ఆయనను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ ఈ నెల 11న అమరుడయ్యాడు. ఆయన ప్రజలకు కాలపు ప్రపంచ మేధావుల్లో ఒకరు.