కరపత్రాలు

మనమంతా ఒకే గొంతుగా నినదిద్దాం

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి పాదయాత్ర తేది : 11.02.2023 చిత్తనూరు నుండి  తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా ! జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే